‘పోలవరం’: 2018 నాటికి గ్రావిటీతో ‘పోలవరం’ నీటిని ఇవ్వడం ఖాయం: మంత్రి దేవినేని
- 2019 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తాం
- ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది
- ఏపీ మంత్రి దేవినేని ఉమ
2018 నాటికి గ్రావిటీతో ‘పోలవరం’ నీటిని ఇవ్వడం, 2019 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయడం ఖాయమని.. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని ఏపీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో దేవినేని మాట్లాడుతూ, ఇప్పటి వరకూ 47 సార్లు తాను ప్రాజెక్టును సందర్శించానని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజున పోలవరం సందర్శించనున్నారని, ఈ ప్రాజెక్టును ఆయన సందర్శించనుండటం 21వ సారని పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం ‘పోలవరం’ను వైసీపీ నాయకులు సందర్శించారని, ఇక్కడ కేవలం మట్టిగుంటలు మాత్రమే కనపడుతున్నాయని, పనులు జరగట్లేదని ఆ నాయకులు వ్యాఖ్యలు చేశారని, ఈ వ్యాఖ్యలు ఎంతో బాధ్యతారాహిత్యంగా, దుర్మార్గంగా ఉన్నాయని మండిపడ్డారు.