మంత్రి గంటా: ఆ చిన్న సిసింద్రీయే ఈరోజు లవర్ బాయ్!: అఖిల్ కు మంత్రి గంటా ప్రశంసలు

  • ‘హలో’ ఆడియో వేడుకలో పాల్గొన్న గంటా శ్రీనివాసరావు
  • చిత్ర పరిశ్రమ విశాఖకు తరలిరావాలని కోరుతున్నా
  • అందుకు అక్కినేని కుటుంబం ముందుండాలన్న మంత్రి

‘సిసింద్రీ’లో చిన్నారి అఖిల్ చేసిన పనులే తనకు గుర్తుకొస్తున్నాయని, ఆ చిన్న సిసింద్రీయే ఈరోజు ఒక మాస్ హీరోగా, లవర్ బాయ్ గా, ఆల్ రౌండర్ గా మారనున్నాడని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ‘హలో’ చిత్రం ఆడియో వేడుకకు హాజరైన ఆయన మాట్లాడుతూ, అక్కినేని వారసుడిగా నాగార్జున సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో ఆ ఇమేజ్ ను కాపాడుకునే ప్రయత్నంలో ఒత్తిడి ఉండేదని, అలానే, నేడు అఖిల్ పై మరింత ఒత్తిడి ఉంటుందని అన్నారు.

షూటింగ్ లకు బెస్ట్ ప్లేస్ వైజాగ్ అని, అద్భుతమైన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయని అన్నారు. చిత్ర పరిశ్రమ విశాఖకు తరలిరావాలని కోరుతున్నానని, అందుకు అక్కినేని కుటుంబం ముందుండాలని కోరారు. ఇప్పటికే, రామానాయుడు స్టూడియో ఇక్కడ ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. 

  • Loading...

More Telugu News