‘హలో’: విశాఖలో మొదలైన ‘హలో’ ఆడియో వేడుక!
- విశాఖలో ‘హలో’ పాటల విడుదల ఫంక్షన్
- హాజరైన మంత్రి గంటా, నాగార్జున, అమల, అఖిల్, పలువురు సినీ ప్రముఖులు
- ఈ నెలలో విడుదల కానున్న ‘హలో’
విక్రం కె.కుమార్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న ‘హలో’ చిత్రం ఆడియో రిలీజ్ వేడుక విశాఖపట్టణంలో జరుగుతోంది. ఈ వేడుకకు మంత్రి గంటా శ్రీనివాసరావు, అక్కినేని నాగార్జున, అమల, అఖిల్, పాటల రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. కాగా, ఈ నెలలో విడుదల కానున్న ‘హలో’కు సంగీతం అనూప్ రూబెన్స్ అందించాడు. అఖిల్ సరసన కల్యాణి ప్రియదర్శన్ నటిస్తుండగా, కీలకపాత్రల్లో జగపతిబాబు, రమ్యకృష్ణ తదితరులు నటిస్తున్నారు.