మహేశ్ కత్తి: జనసేన పార్టీలోకి వచ్చే మహిళలకు పవన్ రక్షణ ఇస్తాడని ఎలా అనుకున్నారు?: మహేశ్ కత్తి వీడియో

  • మహిళలారా...తల్లులారా జనసేనకు దూరంగా ఉండండి
  • అదొక ఉన్మాదపు సేన, అతనో తిక్క సేనాని
  • ఓ మహిళ మాట్లాడుతున్న వీడియో పోస్ట్ చేసిన మహేశ్ కత్తి

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై ఫిల్మ్ క్రిటిక్ మహేశ్ కత్తి మరోమారు విమర్శలు గుప్పించారు. తాజాగా మరోమారు ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘ఇద్దరు పిల్లల తల్లి. ఒక దశాబ్దం పాటు కలిసి బ్రతికిన రేణు దేశాయ్ కి ఫ్యాన్స్ నుంచి బెదిరింపులు వస్తే, ఒక్క మాట కూడా మాట్లాడని పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీలోకి వచ్చే మహిళలకు రక్షణ ఇస్తాడని ఎలా అనుకున్నారు తల్లీ మీరు?

పవన్ కళ్యాణ్ పిచ్చి సేనకు దక్కిన తిక్క సేనాని. అక్కడ ఫ్యాన్స్ అనే భక్తుల మాటలే చెల్లుతాయి. మీకు దక్కేవి అవమానాలు, ప్రాణ భయాలే. మహిళలారా...తల్లులారా జనసేనకు దూరంగా ఉండండి. అదొక ఉన్మాదపు సేన. అతనో తిక్క సేనాని. మీ జాగ్రత్తలో మీరు ఉండండి’ అని మహేశ్ కత్తి తన ఫేస్ బుక్ ఖాతాలో పేర్కొన్నారు. ఒంగోలులో జనసేన పార్టీ సమన్వయ కర్తల సమావేశానికి వెళ్లి నరకం చూశానంటూ విజయలక్ష్మి అనే మహిళ చెబుతున్న వీడియోను ఈ సందర్భంగా మహేశ్ కత్తి  పోస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News