మణిశంకర్ అయ్యర్: మణిశంకర్ అయ్యర్ పై మండిపడ్డ మోదీ!
- భారత్ లో పాక్ హైకమిషనర్ ను మణిశంకర్ అయ్యర్ ఎందుకు కలిశారు?
- అహ్మద్ పటేల్ ను సీఎం చేస్తానని పాక్ ఆర్మీ మాజీ డైరెక్టర్ జనరల్ అర్షద్ రఫిక్ కి హామీ ఇచ్చారు
- ప్రధాని మోదీ వ్యాఖ్యలు
తనపై తప్పుడు వ్యాఖ్యలు, లేని పోని ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత మణిశంకర్ అయ్యర్ పై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శల దాడి కొనసాగుతోంది. గుజరాత్ లోని బనస్కాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నారు. గొంతునొప్పితో బాధపడుతున్నప్పటికీ ఆయన మాట్లాడుతూ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ రాష్ట్రపతి హమీద్ అన్సారీతో కలిసి భారత్ లో పాక్ హైకమిషనర్ సోహైల్ మహమ్మద్ ను మణిశంకర్ అయ్యర్ కలిశారనే వార్తలను ఆయన ప్రస్తావించారు.
పాకిస్థానీయులతో రహస్యంగా సమావేశం కావాల్సిన అవసరమేంటని మోదీ ప్రశ్నించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా అహ్మద్ పటేల్ ను చేసేందుకు పాకిస్థాన్ ఆర్మీ మాజీ డైరెక్టర్ జనరల్ అర్షద్ రఫిక్ కు హామీ ఇచ్చారని మోదీ వ్యాఖ్యానించారు. కాగా, మోదీని ‘నీచ్ ఆద్మీ’ అంటూ మణిశంకర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం లేపిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ మోదీ ఘాటుగా స్పందించడం విదితమే. తనను అడ్డులేకుండా చేసేందుకు మణిశంకర్ అయ్యర్ పాకిస్థాన్ లో సుపారీ ఇచ్చారంటూ మోదీ ఇటీవల ఆరోపించారు.