ధర్మశాల వన్డే: ధర్మశాల వన్డేలో శ్రీలంక ఘన విజయం!

  • భారత్ పై 3 వికెట్ల తేడాతో శ్రీలంక గెలుపు
  • 20.4 ఓవర్లలో శ్రీలంక స్కోర్ ..114/3  
  • తొలివన్డేలో ఘోరంగా విఫలమైన భారత్

భారత్ - శ్రీలంక మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్ లో తొలి వన్డేలో టీమిండియ ఘోరంగా ఓడిపోయింది. ఏడు వికెట్ల తేడాతో భారత్ పై శ్రీలంక సునాయాసంగా విజయం సాధించింది. 20.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయిన శ్రీలంక జట్టు 114 పరుగులు చేసింది. కాగా, ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు అత్యంత ఘోరంగా విఫలమైంది. 27 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

వన్డేల్లో భారత్ అత్యంత తక్కువ స్కోర్ కు ఔటైన రికార్డు నెలకొల్పుతుందేమోననిపించింది. అయితే, ధోనీ తన దైన శైలిలో బ్యాటింగ్ చేసి ఆ గండం నుంచి బయటపడేశాడు. 38.2 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయిన భారతజట్టు 112 పరుగులు చేసింది. స్వల్ప విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు ఆ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి తొలి వన్డేలో ఘన విజయం సాధించింది.

శ్రీలంక స్కోర్ : 114/3 (20.4 ఓవర్లలో)

శ్రీలంక బ్యాటింగ్: గుణతిలక (1), తరంగ (49), తిరుమనే (0), మ్యాథ్యూస్ 25 పరుగులతో, డిక్ వెలా 26 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

భారత్ బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ - 1, బుమ్రా - 1, పాండ్యా -1

టీమిండియా స్కోర్ : 
112/10 (38.2 ఓవరల్లో)

టీమిండియా బ్యాటింగ్ : రోహిత్ శర్మ (2), ధావన్ (0), ఎస్ఎస్ అయ్యర్ (9), కార్తీక్ (0), ఎంకే పాండే(2), పాండ్యా (10), భువనేశ్వర్ కుమార్ (0), కులదీప్ యాదవ్ (19), ధోనీ (65), బుమ్రా (0), ఒక్క పరుగు కూడా చేయని చాహల్ నాటౌట్ గా నిలిచాడు.

శ్రీలంక బౌలింగ్ : లక్మల్ - 4, మ్యాథ్యూస్ - 1, ఫెర్నాండో - 2, పెరీరా - 1, ధనంజయ -1, పతిరణ - 1 

  • Loading...

More Telugu News