బౌలర్ బుమ్రా: టీమిండియా బౌలర్ బుమ్రా ఇంట విషాదం.. సబర్మతి నదిలో తాత మృతదేహం!
- బుమ్రా తాత సంతోక్ సింగ్ ఆత్మహత్య?
- నదిలో తాత మృతదేహాన్ని గుర్తించిన అధికారులు
- మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానాలు
టీమిండియా బౌలర్ బుమ్రా ఇంట విషాదం నెలకొంది. ఇటీవల అదృశ్యమైన ఆయన తాతయ్య సంతోక్ సింగ్ (84) బుమ్రా మృతి చెందారు. సబర్మతి నదిలో ఆయన మృతదేహాన్ని అహ్మదాబాద్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అధికారులు ఈరోజు గుర్తించారు. కాగా, ఈ నెల 6న బుమ్రా పుట్టినరోజును పురస్కరించుకుని జార్ఘండ్ నుంచి అహ్మదాబాద్ కు సంతోక్ సింగ్ వచ్చారు. అయితే, బుమ్రాను కలిసేందుకు అతని తల్లి దల్జీత్ కౌర్ అంగీకరించలేదు.
దీంతో మనస్తాపం చెందిన సంతోక్ సింగ్ జార్ఘండ్ లో ఉన్న తన పెద్ద కుమారుడు బల్వీందర్ సింగ్ కు ఈ నెల 8న ఫోన్ చేశాడు. చనిపోయిన తన భార్య వద్దకు వెళుతున్నానని బల్వీందర్ కు ఫోన్ లో చెప్పిన సంతోక్ సింగ్ ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, సంతోక్ సింగ్ గతంలో వ్యాపారవేత్త. వ్యాపారంలో నష్టాలు రావడం, బుమ్రా తండ్రి చనిపోవడంతో జార్ఘండ్ లో ఉన్న తన కుమారుడు బల్వీందర్ వద్దే ఆయన ఉంటున్నారు. ఆటో నడుపుతూ సంతోక్ సింగ్ జీవిస్తున్నట్టు సమాచారం.