చంద్రబాబు: అఖిలపక్షాన్నిఢిల్లీ తీసుకెళ్లాలన్న నా విజ్ఞప్తికి చంద్రబాబు అంగీకరించారు: ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య

  • హైదరాబాద్ లో చంద్రబాబును కలిసిన కృష్ణయ్య
  • బీసీ సమస్యలు పరిష్కరించాలని వినతి
  • బీసీ రిజర్వేషన్ల కోసం అఖిలపక్షాన్నిఢిల్లీ తీసుకెళ్లాలని కోరిన నేత

బీసీ రిజర్వేషన్ల కోసం అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలనే తన విజ్ఞప్తికి ఏపీ సీఎం చంద్రబాబు అంగీకరించారని టీటీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చెప్పారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఉన్న చంద్రబాబును ఈరోజు ఆయన కలిశారు. అనంతరం మీడియాతో కృష్ణయ్య మాట్లాడుతూ, బీసీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఓ వినతిపత్రాన్ని చంద్రబాబుకు అందజేసినట్టు చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం మరిన్ని పథకాలు ప్రవేశపెడుతోందని, ఏపీలో కూడా బీసీలకు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రూ.20 వేల కోట్లతో బీసీ ఉప ప్రణాళిక ఏర్పాటు చేయాలని కోరినట్టు తెలిపారు. బీసీ రిజర్వేషన్ల కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశానని, అందుకు, ఆయన అంగీకరించారని చెప్పారు.

  • Loading...

More Telugu News