శ్రీలంక: శ్రీలంక విజయ లక్ష్యం 113 పరుగులు
- టీమిండియా స్కోర్ : 112/10
- అత్యల్ప స్కోర్ కే ఆలౌట్ కాకుండా కాపాడిన ధోనీ
- ఈ వన్డేలో 65 పరుగులు చేసి అవుటైన ధోనీ
ధర్మశాల వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక విజయ లక్ష్యాన్ని 113 పరుగులుగా భారత జట్టు నిర్దేశించింది. 38.2 ఓవర్లకే ఆలౌటైన భారతజట్టు కేవలం 112 పరుగులు మాత్రమే చేసింది. తొలుత టాస్ గెలిచిన శ్రీలంక జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో, టీమిండియా బ్యాటింగ్ కు దిగింది. 29 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాల్లో పడింది. అత్యల్ప స్కోర్ కే ఆలౌట్ అవుతుందని అందరూ భావించిన తరుణంలో, ధోనీ తన ఆట తీరుతో ఆ గండం నుంచి గట్టెక్కించాడు.
టీమిండియా స్కోర్ : 112/10
టీమిండియా బ్యాటింగ్ : రోహిత్ శర్మ (2), ధావన్ (0), ఎస్ఎస్ అయ్యర్ (9), కార్తీక్ (0), ఎంకే పాండే(2), పాండ్యా (10), భువనేశ్వర్ కుమార్ (0), కులదీప్ యాదవ్ (19), ధోనీ (65), బుమ్రా (0), ఒక్క పరుగు కూడా చేయని చాహల్ నాటౌట్ గా నిలిచాడు.
శ్రీలంక బౌలింగ్ : లక్మల్ - 4, మ్యాథ్యూస్ - 1, ఫెర్నాండో - 2, పెరీరా - 1, ధనంజయ -1, పతిరణ - 1