YSRCP: ఏందమ్మా ఇది... పక్కకు బాండి... వెనిక్కి పాప్పా: సుతారంగా వారించిన జగన్
- అనంతపురంలో సాగుతున్న జగన్ యాత్ర
- సింగనమల నియోజకవర్గంలో వైకాపా అధినేత
- బీసీ సంఘాలతో సమావేశం
తన పాదయాత్ర 31వ రోజు అనంతపురం జిల్లా సింగనమలలో బీసీ సంఘాలు, నేతలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న వేళ, వేదిక వద్దకు దూసుకొస్తున్న అభిమానులు, ప్రజలను వైకాపా అధినేత వైఎస్ జగన్ సుతారంగా వారించారు. వేదిక వద్ద తోపులాట పెరగడం, ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ఉన్న పరిస్థితుల్లో "అమ్మా ఏందమ్మా ఇది... పక్కు బాండి, ఏందిది? మన మీటింగ్ ను మనమే ఇబ్బంది పెట్టుకుంటే ఎట్లా? ఏంది మీరు చేసేది? గ్యాప్ ఈయండ్రమ్మా... వెనిక్కి పాండ్రి. అట్లా పాండి. వెనిక్కి పా అప్పా, ఏందిది? మనమే చెడగొట్టుకుంటే ఎట్టా? ఏందన్నా నువ్వు కూడా ఇట్లా మాట్లాడుతావు? పాప్పా వెనిక్కి. నా మాట వినుర్రి. మంచోళ్లు గదా మీరంతా... పాప్పా... గ్యాప్ ఇవ్వండి. అక్కడో అవ్వుందిగదా" అంటూ ప్రజలను సర్దే ప్రయత్నం చేశారు జగన్.
అంతకుముందు ఆయన మాట్లాడుతూ, బీసీల అభ్యున్నతికి తన పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. గత ఎన్నికలతో పోలిస్తే, బీసీలకు మరిన్ని సీట్లిచ్చి గౌరవిస్తామని తెలిపారు. అప్పులపాలు కాకుండా బీసీల పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు చదివేలా చూస్తానని హామీ ఇచ్చారు. బీసీల పిల్లలకు హాస్టల్ ఖర్చుల నిమిత్తం ఏడాదికి రూ. 20 వేలు ఇస్తామని అన్నారు.