గుజరాత్: గుజరాత్ శాసనసభ తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం!
- సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లోని 89 స్థానాల్లో పోలింగ్
- సీఎం విజయ్ రూపాని సహా బరిలో 977 మంది అభ్యర్థులు
- ఈ నెల 18న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
గుజరాత్ శాసనసభ తొలిదశ ఎన్నికల పోలింగ్ ఈరోజు ప్రారంభమైంది. గుజరాత్ లోని సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లోని 89 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. తొలివిడత ఎన్నికల బరిలో గుజరాత్ సీఎం విజయ్ రూపాని సహా 977 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ నెల 14న మిగిలిన స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 18న ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది.