: భారత్ కు చేరిన పాక్ ఖైదీ కుటుంబ సభ్యులు


నాలుగు రోజుల క్రితం జమ్మూలోని జైలులో భారత ఖైదీ చేతిలో తీవ్ర దాడికి గురైన పాక్ ఖైదీ సనావుల్లా పరిస్థితి మరింత విషమించిందని చండీగఢ్ వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో అతడి కుటుంబ సభ్యులు ఇద్దరు ఈ రోజు వాఘా సరిహద్దు చెక్ పోస్ట్ ద్వారా భారత్ లోకి అడుగుపెట్టారు. సనావుల్లాను ఆస్పత్రిలో వీరు పరామర్శించనున్నారు. సనావుల్లా సోదరుడు మొహమ్మద్ షాజాద్ మాట్లాడుతూ.. తమ సోదరుడిని చూసేందుకు వచ్చామని, అతడిని పాక్ కు తీసుకెళ్లేందుకు అనుమతించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పాడు.

  • Loading...

More Telugu News