feature phone: మ‌రింత త‌గ్గ‌నున్న ఫీచ‌ర్ ఫోన్ల ధ‌ర‌లు... కార‌ణం ఆండ్రాయిడ్ ఓరియో గో

  • ఫోన్ల‌ త‌యారీకి రంగం సిద్ధం చేసిన మైక్రోమ్యాక్స్‌, లావా
  • ఇప్ప‌టికే అందుబాటు ధ‌ర‌ల్లో ఉన్న ఫీచ‌ర్ ఫోన్లు
  • రూ. 1500 కంటే త‌క్కువ‌కు ప‌డిపోయే అవ‌కాశం

ఇటీల గూగుల్ విడుద‌ల చేసిన ఆండ్రాయిడ్ ఓరియో గో ఫీచ‌ర్ పుణ్య‌మాని మ‌రింత త‌క్కువ ధ‌ర‌కు ఫీచ‌ర్ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. ప్ర‌స్తుతం రూ. 3 వేల నుంచి రూ. 3,500 మ‌ధ్య ఉన్న ఫీచ‌ర్ ఫోన్ల ధ‌ర‌లు, రూ. 2500 నుంచి రూ. 1500 కంటే త‌క్కువ‌కు ప‌డిపోయే అవ‌కాశాలున్నాయని మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఫీచ‌ర్ ఫోన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఆండ్రాయిడ్ ఓరియో గో ఆప‌రేటింగ్ సిస్టం ద్వారా స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేసే ఫీచ‌ర్ ఫోన్‌ను త‌క్కువ ఖ‌ర్చుతో త‌యారు చేసే అవ‌కాశం క‌ల‌గ‌నుంది. ఇప్ప‌టికే ఈ ర‌క‌మైన ఫోన్ల త‌యారీని ప్రారంభించేందుకు మైక్రోమ్యాక్స్‌, లావా సంస్థ‌లు రంగం సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో ఈ ఫోన్లు మార్కెట్‌లోకి రానున్నాయి. ఇక వీరి బాట‌లోనే కార్బ‌న్ కూడా వ‌చ్చే ఏడాది రెండో క్వార్ట‌ర్‌లో ఈ ర‌క‌మైన ఫోన్ల‌ను తీసుకురానుంది. దీంతో ఫీచ‌ర్ ఫోన్ల ధ‌ర‌లు తీవ్రంగా త‌గ్గిపోతాయ‌ని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

More Telugu News