‘జనసేన’: ‘జనసేన’ కాదు.. చంద్రబాబుకు ‘భజన సేన’: వైసీపీ నేత రోజా

  • పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించిన రోజా
  • చంద్రబాబుది తల్లి టీడీపీ.. ‘జనసేన’ పిల్ల టీడీపీ
  • అనుభవం లేని లోకేశ్ మంత్రి కావడం కరెక్టా?

‘జనసేన’ కాదు..చంద్రబాబుకు ‘భజనసేన’ అంటూ వైసీపీ నేత రోజా విమర్శలు గుప్పించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు ఉండేది తల్లి టీడీపీ అయితే, ఈ ‘జనసేన’ పిల్ల టీడీపీ అని చెప్పొచ్చు' అన్నారు. ‘అనుభవం లేని వాళ్లు ముఖ్యమంత్రి అవ్వాలని అనుకోకూడదు’ అని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కూడా రోజా మండి పడ్డారు.

 అనుభవంలేని నారా లోకేశ్ ఎమ్మెల్సీ అయి, మంత్రి అవడం కరెక్టా? అని ఆమె ప్రశ్నించారు. అలానే, పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు లాంటి వాళ్లకు పవన్ కల్యాణ్ భజన చేస్తారని, వాళ్లను తన భుజాలపై పవన్ మోస్తారంటూ విరుచుకుపడ్డారు. వైసీపీ పార్టీ పెట్టకముందే, జగన్ ఎంపీ అయ్యారని, వాళ్ల నాన్న ఉన్నప్పుడు జిల్లా బాధ్యతలు కూడా ఆయన చూసుకునే వారని, రాజకీయంగా ఆయనకు అనుభవం ఉందని రోజా అన్నారు. రాజకీయంగా ఏ అనుభవం ఉందని నాడు చిరంజీవి గారు, పవన్ కల్యాణ్ పార్టీ స్థాపించారని ఆమె ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News