రామ్ నాథ్ కోవింద్: భారత ఆర్థిక వ్యవస్థ నౌకాయాన రంగంపై ఆధారపడి ఉంది: రాష్ట్రపతి

  • నౌకాదళంలోకి జలాంతర్గామి ప్రవేశించి 50 ఏళ్లు పూర్తి
  • విశాఖలో ప్రజంటేషన్ ఆఫ్ కలర్స్ ఉత్సవం
  • ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామ్ నాథ్ కోవింద్, గవర్నర్, సీఎం

భారత ఆర్థిక వ్యవస్థ నౌకాయాన రంగంపై ఆధారపడి ఉందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. నౌకాదళంలోకి జలాంతర్గామి ప్రవేశించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్సవం విశాఖపట్టణంలోని ఐఎన్ఎస్ సర్కార్ మైదానంలో ప్రజంటేషన్ ఆఫ్ కలర్స్ ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామ్ నాథ్ కోవింద్, గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబునాయుడు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రామ్ నాథ్ కోవింద్ మాట్లాడుతూ, నౌకాయానంలో భారత్ కు ఎంతో ప్రాధాన్యం ఉందని, 90 శాతం వర్తకమంతా దీని ద్వారానే జరుగుతోందని అన్నారు. జలాంతర్గాముల విభాగం నౌకాదళంలో అత్యంత శక్తిమంతమైందిగా ఉందని, నౌకాదళంలో 25 సబ్ మెరైన్లు ఉన్నాయని తెలిపారు. శత్రు భయంకరంగా నౌకాదళం ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరుతున్నానని అన్నారు.

కాగా, నేవీ పరేడ్ కు కోవింద్ హాజరయ్యారు. నావికాదళం ఇచ్చే గౌరవ వందనం స్వీకరించారు. ఈ పరేడ్ లో 39 మంది అధికారులు, 621 మంది నావికులు, సబ్ మెరైన్ కి చెందిన 150 మంది సైలర్స్ కూడా పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News