నారా లోకేశ్: కేంద్రం అసలేమీ చేయట్లేదని అనడం కరెక్ట్ కాదు: నారా లోకేశ్

  • పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక ప్యాకేజ్ ఏపీ హక్కు
  • కేంద్రానికి-రాష్ట్రానికి, టీడీపీ-బీజేపీకి మధ్య ఎటువంటి గ్యాప్ లేదు
  • ఏపీ మంత్రి నారా లోకేశ్

పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక ప్యాకేజ్ ఏపీ హక్కు అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. తమ కుటుంబ ఆస్తులను ప్రకటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీకి కేంద్ర ప్రభుత్వం అసలేమీ చేయట్లేదని అనడం కరెక్ట్ కాదని అన్నారు. కేంద్రానికి-రాష్ట్రానికి, టీడీపీ-బీజేపీకి మధ్య ఎటువంటి గ్యాప్ లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కృషి చేశారని అన్నారు. ‘మెట్రో’, హైటెక్ సిటీ, హెచ్ఐసీసీ ప్రాంగణం వంటివి రూపొందించింది చంద్రబాబేనని, రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు అభివృద్ధి చేయడం బాధ్యతలో భాగమని అన్నారు.

  • Loading...

More Telugu News