హీరో సుమంత్: సినీ ఇండస్ట్రీలో పెద్ద అబద్ధం ‘ 2 మినిట్స్’ అని చెప్పడం!: హీరో సుమంత్
- షూటింగ్ లో షాట్ కోసం వెయిట్ చేస్తుంటే ‘2 మినిట్స్’ అంటారు
- రెండు నిమిషాలంటే అరగంట సమయమైనా పట్టొచ్చు
- ఓ ఇంటర్వ్యూలో సుమంత్
సినీ ఇండస్ట్రీలో పెద్ద అబద్ధం ‘2 మినిట్స్’ అని చెప్పడమని హీరో సుమంత్ అన్నారు. ‘మీకు అందరూ కామన్ గా చెప్పే అబద్ధం ఏంటి?’ అని ‘ఐ డ్రీమ్స్’ ఇంటర్వ్యూలో ఆయన్ని ప్రశ్నించగా, ‘సినిమా ఇండస్ట్రీలో ఒకటుంటుంది. ఏ షూటింగ్ లో నైనా షాట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ‘2 మినిట్స్ సార్, రెడీ అయిపోతుంది’ అని చెబుతుంటారు. 2 మినిట్స్ అంటే అరగంట అవొచ్చు..ఇంకెంత సమయమైనా పట్టొచ్చు. ‘2 మినిట్స్’ అనేది సినిమా ఇండస్ట్రీలో ఊతపదం అయిపోయింది. ఇది అబద్ధం అనే విషయం చెప్పే వారికి, వినేవారికీ కూడా తెలుసు! అయినప్పటికీ పట్టించుకోరు’ అని సుమంత్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.