చెన్నారెడ్డి: వేట కొడవళ్లతో దాడి.. వైసీపీ నేత చెన్నారెడ్డి దారుణ హత్య !
- ధర్మవరం మండలం బడనపల్లి సమీపంలో సంఘటన
- వేటకొడవళ్లతో దాడి చేసి హతమార్చిన దుండగులు
- టీడీపీ నేత గంగాధర్ పై చెన్నారెడ్డి కుటుంబసభ్యుల అనుమానం
వైసీపీ నేత చెన్నారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం బడనపల్లి సమీపంలో చెన్నారెడ్డిని దుండగులు దారుణంగా నరికి చంపారు. ఓ పథకం ప్రకారం దుండగులు వేటకొడవళ్లతో ఆయన్ని హతమార్చారు. ఈరోజు ఉదయం పొలం పనుల నిమిత్తం బడనపల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన ఆయనపై దుండగులు వేటకొడవళ్లతో దాడి చేసి హతమార్చారు.
కాగా, టీడీపీ నేత గంగాధర్ పై చెన్నారెడ్డి కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, టీడీపీకి ఏ నియోజకవర్గాల్లో అయితే బలం లేదో ఆ నియోజకవర్గాల్లో ప్రతిపక్షనేతలను హతమారుస్తున్నారని ఆరోపించారు. ఈ మధ్య కాలంలో అనంతపురం జిల్లాలో మూడు హత్యలు జరిగిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీ నేతలు, నాయకులకు అయితే గన్ మెన్లను ఇస్తున్నారని, వైసీపీ నేతలకు సెక్యూరిటీ ఇవ్వాలని కోరితే పట్టించుకోవడం లేదని ఆరోపించారు.