చంద్రబాబు: చంద్రబాబు పాలనను తరిమెల నాగిరెడ్డి చూసి ఉంటే..! : వైఎస్ జగన్

  • తరిమెలకు చేరిన ప్రజా సంకల్ప యాత్ర
  • రాష్ట్రంలో అంతటా అవినీతే
  • చంద్రబాబు నాలుగేళ్ల పాలన అబద్ధాలు, మోసాలమయం: జగన్

చంద్రబాబు పాలనను నాటి కమ్యూనిస్టు నేత తరిమెల నాగిరెడ్డి చూసి ఉంటే బాబును ఏం చేసి ఉండే వాడో అనిపిస్తోందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని తరిమెలకు జగన్ ప్రజా సంకల్పయాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, తరిమెల నాగిరెడ్డిని ఇప్పటికీ మరిచిపోలేమని అన్నారు. రాష్ట్రంలో అంతటా అవినీతే నెలకొందని, చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో అబద్ధాలు, మోసాలమయం అని ఆరోపించారు.

ఎన్నికలప్పుడు ఓ మాట, ఎన్నికల తర్వాత మరోమాట చంద్రబాబు మాట్లాడతారని, అధికారంలోకి వస్తూనే విద్యుత్ బిల్లులు తగ్గిస్తామని చంద్రబాబు చెప్పిన మాటను నిలబెట్టుకోలేదని అన్నారు. నాలుగేళ్ల క్రితం విద్యుత్ బిల్లును, ఇప్పటి విద్యుత్ బిల్లును పోల్చి చూస్తే అసలు విషయం తెలుస్తుందని, పేదలకు ఇళ్లు కట్టిస్తానన్న చంద్రబాబు ఒక్క ఇల్లు అయినా కట్టించారా? నిరుద్యోగులకు రెండు వేల రూపాయల భృతిగా ఇస్తామని చెప్పిన బాబు హామీ ఏమైందని ప్రశ్నించారు. 

  • Loading...

More Telugu News