స్టాక్ మార్కెట్లు: రెండో రోజూ నష్టపోయిన స్టాక్ మార్కెట్లు!

  • 10,100 దిగువకు పడిపోయిన నిఫ్టీ
  • 32,597 పాయింట్ల వద్ద స్థిరపడ్డ సెన్సెక్స్
  • డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.64.49

స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ 205 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 10,100 దిగువకు పడిపోయింది. ఈ ఉదయం 70 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. సెన్సెక్స్ 205 పాయింట్లు నష్టపోయి, 32,597 పాయింట్ల వద్ద ముగిసింది.

ఇక నిఫ్టీ 74 పాయింట్లు నష్టపోయి 10,044 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈలో మారుతి సుజుకీ, టెక్ మహీంద్రా, అంబుజా సిమెంట్, హిందూస్థాన్ యుని లివర్, రిలయన్స్ సంస్థల షేర్లు స్వల్పంగా లాభపడగా, వేదాంత లిమిటెడ్, బాష్ లిమిటెడ్, భారతి ఇన్ ఫ్రాటెల్ మోటార్స్, హిందాల్కో సంస్థల షేర్లు నష్టపోయాయి. కాగా, డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.64.49గా కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News