విశాల్: విశాల్ పై మండిపడ్డ నటుడు, నిర్మాత టి.రాజేందర్
- నిర్మాతల అభివృద్ధికి విశాల్ కృషి చేయాలి
- ఆ తర్వాతే ఎన్నికల్లో పోటీ చేయాలి
- మీడియా సమావేశంలో టి.రాజేందర్ మండిపాటు
చెన్నైలోని ఆర్కేనగర్ ఉపఎన్నికలో తలపడాలనుకున్న ప్రముఖ నటుడు, తమిళనాడు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (టీఎఫ్ పీసీ) అధ్యక్షుడు విశాల్ నామినేషన్ తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నటుడు, ప్రముఖ నిర్మాత టి.రాజేందర్ మాట్లాడుతూ, టీఎఫ్ పీసీకి అధ్యక్షుడుగా ఉన్న విశాల్ ముందుగా తన పదవికి న్యాయం చేయాలని, ఆ తర్వాతే ఎన్నికల్లో పోటీ చేయాలని అన్నారు.
ఆర్కేనగర్ నుంచి కాకపోతే అన్నానగర్, కేకే నగర్ నుంచి పోటీ చేసుకోవచ్చని, అంతకంటే ముందుగా నిర్మాతల అభ్యున్నతికి కృషి చేయాలని మీడియా సమావేశంలో రాజేందర్ మండిపడ్డారు. విశాల్ కు నామినేషన్ వేయడంలో అనుభవం లేదని, అందుకే, ఆర్కేనగర్ ఉప ఎన్నికకు సంబంధించిన ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైందని అన్నారు.