పవన్ కల్యాణ్: పవన్ కల్యాణ్ వైజాగ్ పర్యటన ఒక దెబ్బకు రెండు పిట్టలు లాంటిది!: కత్తి మహేశ్

  • అటు రాజకీయపరంగా లాభం.. ఇటు సినిమా పరంగా ప్రమోషన్
  • అదేమీ తప్పుకాదు .. పవన్ మంచి నిర్ణయం తీసుకున్నారు
  • ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ విమర్శలు

విశాఖపట్టణంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు వైజాగ్ లో పర్యటిస్తున్నారు.

పవన్ కల్యాణ్ వైజాగ్ పర్యటనపై ఓ ఇంటర్వ్యూలో ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ స్పందిస్తూ, ‘పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతున్న ‘అజ్ఞాతవాసి’ చిత్రం ఆడియో రిలీజ్ త్వరలో ఉంది. అలానే ఈ చిత్రం త్వరలోనే విడుదలవుతుంది. ‘ఏక్ పంత్ దో కాజ్’ అంటే ఒక దెబ్బకు రెండు పిట్టలు. అటు రాజకీయపరంగా లాభముంటుంది, ఇటు సినిమా పరంగా ప్రమోషన్ జరిగిపోతుంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టడమనేది తప్పు కాదు. అసలే టైమ్ తక్కువుంది. రెండింటికి పనికొచ్చే పని చేస్తుంటే అంతకన్నా ఏం కావాలి? పవన్ కల్యాణ్ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికైనా, ఆయన జనాల్లోకి వెళుతున్నారు. జనాల్లోకి వెళ్లడం ఆయనకు రెండు రకాలుగానూ ఉపయోగపడుతుంది’ అంటూ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News