హీరో మెగాస్టార్ చిరంజీవి: సినీ పరిశ్రమ అంటేనే మనల్ని మనం నిరూపించుకోవడం!: నటుడు జెమినీ సురేష్
- నేను మొట్టమొదటిసారి చూసిన హీరో మెగాస్టార్ చిరంజీవి
- మనల్ని మనం నిరూపించుకోవాలి
- ఓ ఇంటర్వ్యూలో జెమినీ సురేష్
తాను మొట్టమొదటిసారి చూసిన హీరో మెగాస్టార్ చిరంజీవి అని నటుడు జెమినీ సురేష్ అన్నాడు. ‘ఐ డ్రీమ్’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఎప్పటికీ తన ఫేవరెట్ హీరో చిరంజీవేనని అన్నాడు. తన కెరీర్ ‘జెమినీ’ ఛానెల్ లో మొదలైందని, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా, యాంకర్ గా.. సినీ నటుడి స్థాయికి చేరానని చెప్పాడు.
‘సినీ పరిశ్రమ అంటేనే మనల్ని మనం నిరూపించుకోవడం. ప్రతి దాంట్లోను ‘నాది’ అనే మార్క్ వేసుకున్నాను. ఒక్కమాట చెబుతాను.. మనం ఎదగడం కోసం వేసుకున్న తొలిమార్గం ఏదైతే ఉంటుందో.. ఆ మార్గంలో మనకు ఎవరు తెలియకపోయినా వెళ్లిపోవాలి. ఆ తర్వాత మనల్ని మనం నిరూపించుకోవాలి’ అని జెమినీ సురేష్ చెప్పుకొచ్చాడు.