జెమినీ సురేష్: కాలేజీలో సునీల్ నాకు సీనియర్.. త్రివిక్రమ్ సూపర్ సీనియర్!: జెమినీ సురేష్

  • నేను నటించిన ప్రతి సినిమాలో ‘శభాష్’ అనిపించుకున్నా
  • మొట్టమొదటి అవకాశం కల్పించింది రియల్ స్టార్ శ్రీహరి
  • ఓ ఇంటర్వ్యూలో జెమినీ సురేష్

సినీ ఇండస్ట్రీలో మంచి నటుడిగా సెటిలవ్వాలనేది తన చిరకాల కోరికని జెమినీ సురేష్ అన్నాడు. ‘ఐడ్రీమ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటివరకు తాను నటించిన ప్రతి సినిమాలో ‘శభాష్’ అని ఆయా డైరెక్టర్ల నుంచి అనిపించుకున్నానని చెప్పాడు. ‘సురేష్ ఎందుకలా చేశావు?’ అనే విమర్శ ఏ ఒక్క చిత్రంలో కూడా రాలేదు, అలాంటి విమర్శలు వచ్చి ఉంటే కొంచెం తడబడేవాడినేమోనని అన్నాడు.

 తనకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశానని, తనకు సినిమాల్లో నటించే మొట్టమొదటి అవకాశం కల్పించింది రియల్ స్టార్ శ్రీహరి అని అన్నాడు. నటుడు సునీల్, ప్రముఖ దర్శకుడు, మాటల రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తనకు సాన్నిహిత్యం బాగా ఉందని చెప్పాడు. పాఠశాల, కళాశాల రోజుల్లో సునీల్ తనకు సీనియర్ అని, త్రివిక్రమ్ శ్రీనివాస్ సూపర్ సీనియర్ అని చెప్పాడు.

  • Loading...

More Telugu News