పాతబస్తీ: బ్లాక్ డే దృష్ట్యా పాతబస్తీలో భారీగా మోహరించిన పోలీసులు
- భద్రతా చర్యల దృష్ట్యా 3,500 మందికి పైగా పోలీసుల మోహరింపు
- సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు
- డీసీపీ సత్యనారాయణ వెల్లడి
డిసెంబర్ 6 బ్లాక్ డే దృష్ట్యా హైదరాబాద్ పాతబస్తీలో భారీగా పోలీసులు మోహరించారు. ఈ సందర్భంగా డీసీపీ సత్యనారాయణ మాట్లాడుతూ, పాతబస్తీలో 60 సున్నితమైన, 10 అత్యంత సున్నితమైన ప్రాంతాలను గుర్తించినట్టు చెప్పారు. భద్రతా చర్యల దృష్ట్యా 3,500 మందికి పైగా పోలీసులను మోహరించామని, సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. కాగా, ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేసి రేపటితో ఇరవై ఐదేళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా శాంతి భద్రతలు కాపాడేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.