నితిన్ గడ్కరీ: పోలవరంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఫోన్ చేసిన చంద్రబాబు!
- ‘పోలవరం’కు సహకరించాలని కోరిన చంద్రబాబు
- పునరావాసానికి ఖర్చు చేసిన మొత్తం తిరిగి ఇవ్వాలన్న బాబు
- సానుకూలంగా స్పందించిన నితిన్ గడ్కరీ
పోలవరం ప్రాజెక్టు విషయమై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరికీ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఫోన్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ కు సహకరించాలని గడ్కరీని ఆయన కోరారు. 2019 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి తమ సహాయ సహకారాలు ఉంటాయని, ఈ విషయంలో ఎటువంటి సందేహాలకు తావు లేదని గడ్కరీ హామీ ఇచ్చినట్టు సమాచారం.
ఇప్పటికే రూ.381 కోట్ల విడుదలకు ఉత్తర్వులు ఇచ్చామని గడ్కరీ వెల్లడించారు. పునరావాసం కోసం ఖర్చు చేసిన రూ.2,800 కోట్లు తిరిగి తమకు ఇవ్వాలని చంద్రబాబు కోరగా అందుకు గడ్కరీ సానుకూలంగా స్పందించినట్టు పార్టీ వర్గాల సమాచారం. కాగా, దక్షిణకొరియాలో చంద్రబాబు ప్రస్తుతం పర్యటిస్తున్న విషయం తెలిసింది.