ఆర్కేనగర్: హీరో విశాల్ కు షాక్: ఎన్నికల నామినేషన్ తిరస్కరణ
- విశాల్, దీపకు ఎదురుదెబ్బ
- వివరాలు సరిగా లేకపోవడంతో నామినేషన్లు తిరస్కరించిన అధికారులు
- విశాల్ ను బలపరిచిన వారిలో సరిగా లేని ఇద్దరి సంతకాలు
తమిళనాడులోని ఆర్కేనగర్ నియోజకవర్గ ఉపఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగాలనుకున్న నటుడు విశాల్ కు ఎదురుదెబ్బ తగిలింది. విశాల్ నామినేషన్ ను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. విశాల్ ను బలపరుస్తూ సంతకాలు చేసిన పది మందిలో ఇద్దరి సంతకాలు సరిగా లేకపోవడంతో ఆ నామినేషన్ ని తిరస్కరించినట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది. కాగా, ఆర్కేనగర్ ఉపఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్న జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కు చుక్కెదురైంది. ఆమె నామినేషన్ ని కూడా ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. వివరాలు సరిగ్గా లేకపోవడంతో ఆమె నామినేషన్ ని తిరస్కరించామని సంబంధిత అధికారులు తెలిపారు.