జేసీ సోదరులు: జేసీ సోదరులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకుడు
- జేసీ సోదరులు చేతగాని దద్దమ్మలు
- ముప్పై ఏళ్లలో వాళ్లు ఒరగబెట్టిందేమీ లేదు
- హత్యలు చేయడమే వారి సంస్కృతి: వైసీపీ నాయకుడు పెద్దారెడ్డి
జేసీ సోదరులపై తాడిపత్రి వైసీపీ సమన్వయ కర్త పెద్దారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హత్యలు చేయడమే జేసీ సోదరుల సంస్కృతి అని ఆరోపించారు. జేసీ సోదరులు చేతగాని దద్దమ్మలని, ముప్పై ఏళ్లలో తాడిపత్రికి వాళ్లిద్దరూ ఒరగబెట్టిందేమీ లేదని అన్నారు. తాడిపత్రి వాళ్ల సొత్తేమీ కాదని, తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తాడిపత్రి గెలుపును పార్టీకి కానుకగా ఇవ్వాలని, ప్రతి ఒక్కరికీ తాను అండగా ఉంటానని పెద్దారెడ్డి అన్నారు.