కేసీఆర్: అబద్ధాలు చెప్పడంలో కేటీఆర్ తన తండ్రిని మించిపోయారు: డీకే అరుణ
- సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై అరుణ విమర్శలు
- తెలంగాణ రాష్ట్రంపై కేటీఆర్ కు ఏమాత్రం అవగాహన లేదు
- నియంతృత్వ పోకడలతో కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే అరుణ విమర్శలు గుప్పించారు. అబద్ధాలు చెప్పడంలో కేటీఆర్ తన తండ్రిని మించిపోయారని, రాష్ట్రంపై కేటీఆర్ కు ఏమాత్రం అవగాహన లేదని, తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఏమీ లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ నియంతృత్వ పోకడలతో రాష్ట్రం తలదించుకునే పరిస్థితి నెలకొందని ఆమె మండిపడ్డారు.