: పదేళ్లుగా బందీలైన ముగ్గురు యువతులకు విముక్తి
ముగ్గురు యువతులు 10ఏళ్ల క్రితం మిస్సయ్యారు. అప్పుడు వారి వయసు 20ఏళ్లు. పదేళ్లుగా అమెరికాలోని డౌన్ టౌన్ లో ఒక ఇంట్లో బందీలుగా ఉన్నారు. తాళ్లతో కట్టేసి ఉన్న వీరిని సోమవారం పోలీసులు విడిపించారు. పోలీసులకు వచ్చిన కాల్ ఆధారంగా వీరికి విముక్తి కల్పించారు. వీరి ఆరోగ్య పరిస్థితి సాధారణగానే ఉందని ప్రకటించారు. ఈ ఘటనలో ముగ్గురు సోదరులను అరెస్ట్ చేశారు. అసలేం జరిగింది అన్నదానిపై విచారణ జరుగుతోంది.