: మరపురాని మహనీయుడు
పార్లమెంట్ లో్ దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఆయన మీడియాతో తన అనుభవాన్ని పంచుకున్నారు. తెలుగువారి కోసం ఎన్టీఆర్ ఎంతగానో పాటుపడ్డారని, తెలుగువారందరూ మరచిపోలేని మహనీయ వ్యక్తి అని చంద్రబాబు కొనియాడారు. ఎన్టీఆర్ కుటుంబంతో అనుబంధం, ఆయనతో కలిసి పని చేసిన అనుభవం తనకు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నామని చెప్పారు.