: సైఫ్ కుమార్తె సరా త్వరలో బాలీవుడ్ ప్రవేశం
సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సరా త్వరలో బాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేయనుంది. ఈ విషయాన్ని సరా అత్తమ్మ, సైలీ అలీఖాన్ సోదరి సోహా అలీఖాన్ వెల్లడించింది. "సరా చాలా స్మార్ట్, డ్యాన్స్ కూడా అదరగొడుతుంది. ప్రస్తుతం సరా అమెరికాలోని ఒక కాలేజీలో చదువుతోంది. ముందు సరా స్టడీస్ పూర్తికావాలని కోరుకుంటున్నాం. సరా నటనను నిర్ణయించాల్సింది తల్లిదండ్రులే. అయితే, సరా దగ్గర మంచి సామర్థ్యం ఉంది. ఆమెను నటనలోకి ఎందుకు దింపకూడదు" అని సోహా మీడియాతో అన్నారు.