Chandrababu: సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి
- ఉండవల్లిలో కాసేపట్లో చంద్రబాబుతో భేటీ
- అనంతరం టీడీపీలోకి జంప్
- గుర్నాథ్రెడ్డికి పార్టీ కండువా కప్పనున్న చంద్రబాబు
అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గుర్నాథ్ రెడ్డి టీడీపీలో చేరడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడి సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఇప్పటికే ఆయన ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. మరోవైపు గుర్నాథ్ రెడ్డి టీడీపీలో చేరుతుండడంతో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి టీడీపీ అధిష్ఠానం మీద అలిగిన విషయం తెలిసిందే.