YSRCP: ఓ ముఖ్యనేత కోసం ఎదురుచూస్తున్నాం... అదే జరిగితే వైసీపీ దుకాణం బంద్: అచ్చెన్నాయుడు
- పాదయాత్ర ముగిసే నాటికి వైసీపీ ఖాళీ అవుతుంది
- జగన్ తల్లి, చెల్లి మాత్రమే పార్టీలో ఉంటారు
- జగన్ ను ప్రజలు నమ్మడం లేదు
వైసీపీలో ఉన్న ఓ ముఖ్య నేత కోసం తాము వేచి చూస్తున్నామని... అదే జరిగితే వైసీపీ దుకాణం ఖాళీ అవుతుందని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈ రోజు అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. జగన్ పాదయాత్ర ముగిసే నాటికి వైసీపీలో ఆయన తల్లి, చెల్లి, కొద్ది మంది బంధువులు మాత్రమే ఉంటారని చెప్పారు. టీడీపీలోకి మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చి చేరితే... రాజ్యసభలో అభ్యర్థిని నిలిపే బలం కూడా ఆ పార్టీకి ఉండదని అన్నారు. జగన్ ను ప్రజలు నమ్మడం లేదని ఆయన తెలిపారు.