Allu Arjun: 'నా పేరు సూర్య' కోసం డూప్ లేకుండా ఫైట్ చేసిన బన్నీ

  • అల్లు అర్జున్ హీరోగా 'నా పేరు సూర్య'
  • ఇటీవలే యాక్షన్ సీన్స్ చిత్రీకరణ 
  • ముఖ్యమైన పాత్రల్లో యాక్షన్ కింగ్ అర్జున్ .. శరత్ కుమార్

అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య' తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించారు. ఈ యాక్షన్ సీన్స్ లో డూప్ లేకుండా బన్నీ పాల్గొన్నట్టు సమాచారం. ఆడియన్స్ థ్రిల్ కావడానికి ఆ ఫైట్స్ ను తాను చేస్తేనే బాగుంటుందని భావించి రంగంలోకి దిగినట్టుగా చెబుతున్నారు.

ఈ యాక్షన్ సీన్స్ బన్నీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటాయని అంటున్నారు. ఇక ఈ సినిమా షూటింగులో తనకి బన్నీ అందిస్తోన్న సహకారం మరువలేనిదని వక్కంతం వంశీ అంటున్నాడు. బన్నీ సపోర్ట్ కారణంగానే తాను అనుకున్న అవుట్ పుట్ వస్తోందని చెబుతున్నాడు. డిఫరెంట్ లుక్ తో బన్నీ కనిపించనున్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ .. శరత్ కుమార్ కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు.         

More Telugu News