: ఐపిఎల్ రసవత్తరం
మరో మూడు వారాల్లో ఐపిఎల్ 6వ సీజన్ ముగుస్తుంది. ఇందులో భాగంగా ఈ రోజు రెండు కీలక మ్యాచులు జరగనున్నాయి. రాజస్థాన్, ఢిల్లీ జట్ల మధ్య జైపూర్ లో సాయంత్రం 4 గంటల నుంచీ పోరు ప్రారంభమవుతుంది. పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో ఉన్న రాజస్థాన్ జట్టు ప్లే ఆఫ్ కు చేరాలంటే ఢిల్లీపై గెలిచి తీరాలి. ఇక కోల్ కతా, ముంబై జట్ల మధ్య మ్యాచ్ రాత్రి 8 గంటలకు ముంబైలో ప్రారంభమవుతుంది. రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకమే.