naga chaitanya: నాగచైతన్య పుట్టినరోజు కానుకగా `సవ్యసాచి` ఫస్ట్‌లుక్!
- శక్తిమంతమైన పాత్రలో కనిపిస్తున్న చైతన్య
- 2018 మార్చిలో విడుదల కానున్న చిత్రం
- ఈ చిత్రం తర్వాత 'శైలజా రెడ్డి అల్లుడు'
నవంబర్ 23న నాగచైతన్య పుట్టినరోజు కానుకగా ఇవాళ `సవ్యసాచి` ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. నిధి అగర్వాల్ ఇందులో కథానాయికగా నటిస్తోంది. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాధవన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో నాగచైతన్య చాలా శక్తిమంతమైన పాత్రలో నటిస్తున్నట్టు ఫస్ట్‌లుక్ చూస్తే అర్థమవుతోంది.
ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అయితే నాగచైతన్య గత చిత్రం `యుద్ధం శరణం` ఫస్ట్లుక్లాగే ఉందని కొంతమంది అభిమానులు పెదవి విరుస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ పక్క పెళ్లిలో బిజీగా ఉండి కూడా నాగచైతన్య ఈ చిత్రం షూటింగ్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మారుతి దర్శకత్వంలో నాగచైతన్య నటించనున్నాడు. ఆ చిత్రానికి ‘శైలజారెడ్డి అల్లుడు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.