hafeez saeed: గృహ నిర్బంధం నుంచి ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ విడుదల!

  • హౌస్ అరెస్ట్ నుంచి విడుదల
  • విడుదల చేయవద్దన్న ప్రభుత్వ విజ్ఞప్తిని తిరస్కరించిన కోర్టు
  • సరైన సాక్ష్యాలను అందించలేకపోయారంటూ కామెంట్

26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ ను విడుదల చేయాలంటూ పాకిస్థాన్ లోని పంజాబ్ హైకోర్టుకు చెందిన జ్యూడీషియల్ రివ్యూ బోర్డు ఆదేశించింది.

సయీద్ తో పాటు అతని అనుచరులు అబ్దుల్లా ఉబెయిద్, మాలిక్ జాఫర్ ఇక్బాల్, అబ్దుల్ రెహ్మాన్, క్వాజీ కశిఫ్ హుస్సేన్ లను పాక్ లోని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 31న హౌస్ అరెస్ట్ చేసింది. ఉగ్రవాద నిరోధక చట్టం 1997 కింద 90 రోజుల పాటు వీరికి గృహనిర్బంధం విధించింది. ఆ తర్వాత 'పబ్లిక్ సేఫ్టీ లా' కింద వీరి నిర్బంధాన్ని రెండు సార్లు పొడిగించింది. గత నెల సయీద్ నిర్బంధాన్ని మరో 30 రోజుల పాటు పొడిగించింది పాకిస్థాన్ జ్యూడీషియల్ రివ్యూ బోర్డ్. అక్టోబర్ చివరి వారంలో సయీద్ అనుచరులను విడుదల చేసింది.

హఫీజ్ హౌస్ అరెస్ట్ ను పొడిగించడం సాధ్యం కాదంటూ ఈ సందర్బంగా జ్యుడీషియల్ రివ్యూ బోర్డు తెలిపింది. అతనిపై చేసిన ఆరోపణలకు సంబంధించి సరైన సాక్షాధారాలను ప్రభుత్వం అందించలేకపోయిందని పేర్కొంది. సయీద్ ను విడుదల చేస్తున్నట్టు తీర్పును వెలువరించింది. సయీద్ ను విడుదల చేస్తే పాకిస్తాన్ పై అంతర్జాతీయ సమాజం ఆంక్షలు విధించే అవకాశం ఉందంటూ ప్రభుత్వం భయాందోళనలను వ్యక్తపరిచినప్పటికీ ఫలితం లేకపోయింది. 

More Telugu News