దీపికా పదుకొణే: దీపికా పదుకొనే, భన్సాలీ తలలు తెస్తే నజరానా ప్రకటించిన బీజేపీ నేతకు షోకాజ్ నోటీసు

  • సూరజ్ పాల్ అముకు షోకాజ్ నోటీసు జారీ 
  • ఆ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదు
  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ జైన్

‘పద్మావతి’ చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి, హీరోయిన్ దీపికా పదుకొనే తలలు తెస్తే రూ.10 కోట్ల నజరానా ప్రకటించిన బీజేపీ నేత సూరజ్ పాల్ అముకు పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. సూరజ్ పాల్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, వాటితో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ జైన్ పేర్కొన్నారు.

రాజ్యాంగం ప్రకారం సూరజ్ పాల్ పై ఎటువంటి చర్యలు తీసుకున్నా తమకు సంబంధం లేదని, ఈ మేరకు అతనికి షోకాజ్ నోటీసు జారీ చేశామని ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, ‘పద్మావతి’ చిత్రంపై వివాదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సూరజ్ పాల్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ దీపికా పదుకొనే, సంజయ్ లీలా భన్సాలీ తలలను తెచ్చిన వారికి రూ.10 కోట్లు నజరానాగా ఇస్తానని ఇటీవలే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News