: ఈ ఏడాదిలో షార్ 5 రాకెట్ల ప్రయోగాలు
శ్రీహరికోట నుంచి ఈ ఏడాదిలో మొత్తం అయిదు రాకెట్ ప్రయోగాలు చేయడానికి భారత అంతరిక్షపరిశోధన కేంద్రం ప్రణాళిక రచిస్తోంది. వీటిలో అంగారక గ్రహ యాత్ర కూడా ఒకటి. జూన్ నుంచి డిసెంబరు మధ్యలో నాలుగు రాకెట్ ప్రయోగాలు జరుగుతాయి. వీటిలో జిశాట్ 14 ప్రయోగం కూడా ఒకటి. జూన్ 10 , 15 తేదీల మధ్య కాలంలో నావిగేషనల్ శాటిలైట్ ప్రయోగం ఉంటుందని, ఆ తర్వాత జులైలో జిశాట్ 14 ప్రయోగం ఉంటుందని ఇస్రో సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
ఇదే ఏడాదిలో ఇస్రో అంగారక గ్రహం మీదికి కూడా ఒక రాకెట్‌ను ప్రయోగించబోతున్నదని సదరు అధికారి తెలియజేశారు.