నటి అర్చన: సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు నాకు ప్రపోజ్ చేశారు కానీ, నేను ఒప్పుకోలేదు!: నటి అర్చన
- మానసికంగా నేను చాలా స్ట్రాంగ్
- ఐ లవ్ మై సెల్ఫ్ అండ్ ఐ వాల్యూ మై సెల్ఫ్
- నాకెవరైనా నచ్చితే వాళ్లకు ఇంకా దూరంగా ఉంటాను
- ఓ ఇంటర్వ్యూలో నటి అర్చన
చాలా మంది పెళ్లి చేసుకోవాలి కాబట్టి చేసుకుంటారని, తన ఆలోచనా విధానం మాత్రం అలా ఉండదని, మానసికంగా చూస్తే తాను చాలా స్ట్రాంగ్ గా ఉంటానని నటి అర్చన చెప్పింది. ‘ఐడ్రీమ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘అభద్రతా భావంతో ఉండను. ఆర్థిక స్వాతంత్ర్యం ఉన్న వ్యక్తిని నేను. నన్ను నేను చాలా గౌరవించుకుంటాను. ఐ లవ్ మై సెల్ఫ్ అండ్ ఐ వాల్యూ మై సెల్ఫ్.
మంచి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నేను కోరుకుంటాను. సినిమా ఇండస్ట్రీలో నేను ఇంత వరకూ ఎవరికి ప్రపోజ్ చేయలేదు. వాస్తవం చెప్పాలంటే, నాకెవరైనా నచ్చితే వాళ్లకు ఇంకా దూరంగా ఉంటాను. సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లే నాకు ప్రపోజ్ చేశారు కానీ, వాళ్ల నిజాయతీ, నిబద్ధత గురించి అనుమానం వచ్చింది. నేను ఒప్పుకోలేదు’ అని చెప్పుకొచ్చింది.