రిచా గంగోపాధ్యాయ్: రహస్య వివాహం వార్తలను ఖండించిన ‘మిర్చి’ హీరోయిన్

  • ఇలాంటి వదంతులు సృష్టించొద్దు
  • పెళ్లి చేసుకునేటప్పుడు నేను తెలియజేస్తా
  • స్పష్టం చేసిన రిచా గంగోపాధ్యాయ్

తన చిన్ననాటి స్నేహితుడిని రహస్యంగా పెళ్లి చేసుకుందంటూ వస్తున్న వార్తలను ‘మిర్చి’ కథానాయిక రిచా గంగోపాధ్యాయ్ ఖండించింది. ఇలాంటి వదంతులను సృష్టించొద్దని ఆమె కోరారు. పెళ్లి చేసుకునేటప్పుడు ఆ వార్తను తానే ముందుగా తెలియజేస్తానని, ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదని అన్నారు.

తాను నటించబోయే తర్వాతి సినిమా ఏంటని చాలా మంది అడుగుతున్నారని, వాళ్లందరికీ తాను చెప్పబోయే సమాధానం.. ‘నేను సినిమాలకు స్వస్తి చెప్పి ఐదేళ్లు’ అయిందని అన్నారు. ఇప్పుడు తన కొత్త జీవితంలోకి అడుగుపెట్టానని, ఇందులో నటన అనే అంశానికి తావు లేదని రిచా చెప్పుకొచ్చారు. కాగా, ‘లీడర్’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రిచా, ‘నాగవల్లి’, ‘మిరపకాయ్’, ‘సారొచ్చారు’, ‘మిర్చి’, ‘భాయ్’  చిత్రాల్లోనే కాకుండా, రెండు తమిళ చిత్రాల్లోనూ నటించింది.

  • Loading...

More Telugu News