సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి: ప్రత్యేక హోదాను అసెంబ్లీ ఇస్తుందా?: మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
- ‘చలో అసెంబ్లీ’ నిర్వహిస్తే లాభమేంటి?
- ప్రత్యేక హోదా సాధన కమిటీని ప్రశ్నించిన సోమిరెడ్డి
- జగన్ విమర్శలు చేయడం సబబు కాదు
ఏపీకి ప్రత్యేక హోదా కోసం ‘చలో అసెంబ్లీ’ నిర్వహిస్తే లాభమేంటి?, ప్రత్యేక హోదాను అసెంబ్లీ ఇస్తుందా? అని ప్రత్యేక హోదా సాధన కమిటీని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ లాబీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షనేత జగన్ తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తామంటే మేం వద్దన్నామా? అని ప్రశ్నించారు.
అసెంబ్లీ సమావేశాలకు రాకుండా జగన్ విమర్శలు చేయడం సబబు కాదని, ‘పట్టిసీమ’కు రాయలసీమకు సంబంధమేంటని జగన్ ప్రశ్నించడం ఆయన అవివేకానికి నిదర్శనమని అన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు వంద టీఎంసీల నీటిని ఇవ్వడం వల్లే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నీటిని రాయలసీమకు మళ్లించగలిగామని అన్నారు.