ధోనీ: ధోనీ విషయాన్ని సెలెక్టర్లకే వదిలేద్దాం: కపిల్ దేవ్

  • ధోనీ టీ20 జట్టులో కొనసాగాలా? వద్దా? పై స్పందించిన కపిల్
  • నేను ఏదైనా అభిప్రాయం చెబితే అది అందరినీ తికమకపెట్టే అవకాశం ఉందన్న మాజీ కెప్టెన్
  • మీడియాతో కపిల్ దేవ్ 

ఎంఎస్ ధోనీ టీ20 జట్టులో కొనసాగాలా? వద్దా? అనే అంశంపై టీమిండియా దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించారు. ఓ సమావేశంలో పాల్గొన్న కపిల్ ను ఈ విషయమై మీడియా ప్రశ్నించగా, ‘నేను ఏదైనా అభిప్రాయం చెబితే అది అందరినీ తికమకపెట్టే అవకాశం ఉంది. అందుకే, ధోనీ సెలెక్షన్ విషయాన్ని మనం సెలెక్టర్లకే వదిలేద్దాం’ అని  పేర్కొన్నారు.

 కాగా, టీ20 జట్టులో ధోనీ కొనసాగడమా? లేక రిటైర్ అవడమా? అనే విషయంపై చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లీలు ధోనీకి మద్దతుగా నిలుస్తున్నారు. క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, అజిత్ అగార్కర్ సహా మరికొందరు మాత్రం ఆయన జట్టులో నుంచి వైదొలిగి జూనియర్లకు అవకాశం ఇవ్వాలని అంటున్నారు.

  • Loading...

More Telugu News