చిరంజీవి: చంద్రబాబు సీఎం అయితే కమ్మలకు..చిరంజీవి సీఎం అయితే కాపులకు కడుపు నిండదు: ఏబీఎన్ ఎండి రాధాకృష్ణ

  • ఇలాంటి వ్యాఖ్యల ద్వారా చిరంజీవికే ఎక్కువ నష్టం
  • చిరంజీవి అందరివాడు
  • ఓపెన్ డిబేట్ లో రాధాకృష్ణ

‘మా చిరంజీవి, మా ‘మెగా’ ఫ్యామిలీ..’ అంటూ నిర్మాత బన్నీ వాసు వ్యాఖ్యానించడం సబబు కాదని ఏబీఎన్ ఎండి రాధాకృష్ణ అన్నారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నంది అవార్డులపై వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏబీఎన్ నిర్వహించిన ఓపెన్ డిబేట్ లో నిర్మాత బన్నీ వాసు ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై రాధాకృష్ణ ‘ఇలాంటి వ్యాఖ్యల ద్వారా చిరంజీవికే ఎక్కువ నష్టం. మా చిరంజీవి అని మాట్లాడటం సరికాదు. చిరంజీవి అందరివాడు. కులం పేరిట ఎవరి కడుపు నిండదు.చంద్రబాబు సీఎం అయితే కమ్మలకు..చిరంజీవి సీఎం అయితే కాపులకు కడుపు నిండదు’ అని రాధాకృష్ణ అన్నారు.  

  • Loading...

More Telugu News