బన్నీ వాసు: మా చిరంజీవికి, మా ‘మెగా’ ఫ్యామిలీకి అన్యాయం జరిగింది: నిర్మాత బన్నీ వాసు
- 2002 నుంచి ‘మెగా’ ఫ్యామిలీకి అన్యాయం జరిగింది
- అవార్డుల ఎంపికలో రికమండేషన్సే ఎక్కువ
- ఓపెన్ డిబేట్ లో బన్నీవాసు
మా చిరంజీవి, మా ‘మెగా’ ఫ్యామిలీకి 2002 నుంచి అవార్డుల విషయంలో అన్యాయం జరిగిందని ప్రముఖ నిర్మాత బన్నీ వాసు అన్నారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నంది అవార్డులపై వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని దసపల్లా హోటల్‌లో ఓపెన్ డిబేట్ కార్యక్రమాన్ని ఏబీఎన్ నిర్వహించింది. ఈ డిబేట్ లో పాల్గొన్న బన్నీ వాసు మాట్లాడుతూ, అవార్డుల ఎంపికలో రికమండేషన్సే ఎక్కువ అని అన్నారు.