శ్రీలంక: కోల్ కతా టెస్టు: శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 294 ఆలౌట్

  • ముగిసిన  శ్రీలంక తొలి ఇన్నింగ్స్
  • 122 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం
  • 83.4  ఓవర్లకు 294 పరుగులకు ఆలౌట్

కోల్ కతా వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక తొలి ఇన్నింగ్స్ ముగిసింది.  ఓవర్ నైట్ స్కోర్ 165/4తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన పర్యాటక జట్టుకు శుభారంభం దక్కలేదు. 83.4  ఓవర్లకు 294 పరుగులకు ఆలౌటైంది. 122 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. శ్రీలంక బ్యాటింగ్ లో రంగనా హెరాత్ (67), మ్యాథ్యూస్ (52), తిరిమన్నె (51), డిక్ వెలా (35) పరుగులు చేశారు. భారత్ బౌలింగ్ లో భువనేశ్వర్ 4, షమీ 4, ఉమేష్ యాదవ్ 2 వికెట్లు తీశారు.

 




  • Loading...

More Telugu News