: మందుబాబులూ ... ఈ 'మందు' ట్రై చేయండి!


మద్యం తాగే వారికి ఎంత కిక్‌ లభిస్తుందో గానీ, వారితో ఇబ్బందులు పడేవారికి మాత్రం అది చాలా చికాకు కలిగిస్తుంటుంది. లిక్కర్‌ అలవాటును అర్జంటుగా మాన్పించేయాలని అనుకుంటూ ఉంటారు. మార్కెట్లో అలవాటు మాన్పించడానికి కొన్ని మందులు కూడా ఉన్నాయి. కానీ దాని వల్ల కొన్ని సైడ్‌ ఎఫెక్ట్స్‌ తలెత్తుతుంటాయి. అయితే మద్యం అలవాటును ఏకబిగిన మాన్పించేయడం కాకుండా.. మద్యప్రియులను కంట్రోల్‌ చేస్తూ.. వారు మద్యం తీసుకునే మోతాదును తగ్గించేలా నియంత్రించే ఒక మాత్రను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

సెలిన్‌క్రో అనే ఔషధం తో కూడిన ఈ మాత్రను రోజుకొకటి వంతున తీసుకుంటే.. మందుబాబులు ప్రతిరోజూ తీసుకునే లిక్కర్‌ మోతాదు బాగా తగ్గిపోతుందిట. బ్రిటన్‌లో జరిపిన అధ్యయనంలో ఈ మాత్రతో పాటూ కౌన్సెలింగ్‌ కూడా తీసుకున్న వారు మద్యం తీసుకునే మోతాదు 61 శాతం తగ్గినట్లు తయారీదార్లు చెబుతున్నారు. పైగా, హఠాత్తుగా మద్యం మానేయడం వల్ల కలిగే ఆరోగ్య పరమైన ఇబ్బందులు ఇందులో ఉండవు. సెలిన్‌క్రో అనేది.. మందు మాన్పించడం కాదు.. కంట్రోల్‌ మాత్రమే చేస్తుందని వారు అంటున్నారు.

  • Loading...

More Telugu News