KCR: గీతారెడ్డి గారూ... ఐ ఎగ్రీ విత్ యూ!: అసెంబ్లీలో కేసీఆర్

  • ఎస్సీ, ఎస్టీల్లో అత్యధికులు పేదలే
  • గత ప్రభుత్వాల వైఖరే కారణం
  • పరిస్థితి ఒక్కరోజులో మారిపోదు
  • తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్

తెలంగాణలో ఎస్సీ, ఎస్టీలు సహా, అణగారిన కులాలకు చెందిన ఎంతో మంది దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న మాట వాస్తవమేనని, ఈ విషయంలో విపక్ష మహిళా నేత గీతారెడ్డి చెప్పిన మాటలను తాను అంగీకరిస్తున్నానని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఎస్సీ, ఎస్టీ సంక్షేమంపై అసెంబ్లీలో చర్చ జరుగగా, కేసీఆర్ సమాధానం ఇచ్చారు.

"గీతారెడ్డి గారూ... ఐ ఎగ్రీ విత్ యూ" అంటూ పరిస్థితులు ఒక్కరోజులో మారిపోవని, గత పాలకులు తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగానే పరిస్థితులు దారుణంగా మారాయని విమర్శించారు. తాను ఓపెన్ గా కొన్ని విషయాలు ఒప్పుకుంటానని, ఆ ధైర్యం కాంగ్రెస్ కు లేదని ఎద్దేవా చేశారు.

ఎస్సీ, ఎస్టీల్లో ఏ జిల్లాలో ఎవరికి అన్యాయం జరిగిందో సభ దృష్టికి తీసుకువస్తే, తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. నిరాధార ఆరోపణలు చేయడం తగదని, ఇదే విషయమై రెండు రోజుల చర్చకైనా తనకు అభ్యంతరం లేదని, కానీ కాంగ్రెస్ ప్రతి విషయాన్నీ రచ్చ చేయాలని చూస్తే మాత్రం ఊరుకోబోయేది లేదని హెచ్చరించారు.

More Telugu News