పాపికొండలు: పాపికొండలు విహార యాత్రకు వెళ్లే బోట్ల తనిఖీలు!

  • విజయవాడలో పడవ బోల్తా ఘటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తం  
  • పర్యాటక ప్రదేశాలకు వెళ్లే బోట్లను రెవెన్యూ, పోలీస్, పర్యాటక శాఖాధికారుల సంయుక్త తనిఖీలు
  • నిబంధనలకు విరుద్ధంగా ఉన్న రెండు బోట్లు సీజ్ 

విజయవాడలో పడవ బోల్తా పడిన సంఘటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలకు వెళ్లే బోట్లను రెవెన్యూ, పోలీస్, పర్యాటక శాఖాధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న, ఈరోజు పాపికొండలు విహారయాత్రకు వెళ్లే బోట్లను అధికారులు తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న రెండు బోట్లను సీజ్ చేశారు. ఈరోజు విహారయాత్రకు వెళ్లే బోట్లను నిలిపివేశారు.

  • Loading...

More Telugu News